Please enable javascript.Swing Trading Stocks : 5 నుంచి 30 రోజుల్లో టార్గెట్ ప్రైజ్ ను చేరుకునే అవకాశం ఉన్న రెండు స్టాక్స్.. వీటిపై ఒక లుక్కేయండి.. - these two small cap swing trading stocks recommended by vla ambala for huge returns | The Economic Times Telugu

Swing Trading Stocks : 5 నుంచి 30 రోజుల్లో టార్గెట్ ప్రైజ్ ను చేరుకునే అవకాశం ఉన్న రెండు స్టాక్స్.. వీటిపై ఒక లుక్కేయండి..

Authored by Rupesh | The Economic Times Telugu | Updated: 16 May 2024, 11:13 am

ప్రముఖ సెబీ రిజిస్టర్డ్ స్టాక్ రీసెర్చ్ అనలిస్ట్ అయిన వీఎల్ఏ అంబాలా, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే కోసం స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన రెండు స్టాక్స్ ను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం రికమండ్ చేయడం జరిగింది.

 
Swing trading stocks
Representative Image
స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే కోసం స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన రెండు స్టాక్స్ ను ప్రముఖ సెబీ రిజిస్టర్డ్ స్టాక్ రీసెర్చ్ అనలిస్ట్ అయిన వీఎల్ఏ అంబాలా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం రికమండ్ చేయడం జరిగింది. ఈ రెండు స్టాక్స్ జాబితాలో మొదటిది కన్స్ట్రక్షన్ వెహికల్స్ సెక్టార్ కి చెందిన సాంగ్వి మూవర్స్ లిమిటెడ్ కాగా, రెండవది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెక్టార్ కి చెందిన హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఇక ఈ రెండు స్మాల్ క్యాప్ స్టాక్స్ కి సంబంధించిన టార్గెట్ ప్రైజ్, స్టాప్ లాస్ ను రీసెర్చ్ అనలిస్ట్ అయిన వీఎల్ఏ అంబాలా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం సూచించడం జరిగింది.
సాంగ్వి మూవర్స్ లిమిటెడ్ :

ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో సాంగ్వి మూవర్స్ లిమిటెడ్ షేరు ధర 0.2 శాతం నష్టపోయి రూ. 1438.35 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ షేరుకు రూ. 1525 నుంచి రూ. 1650 టార్గెట్ ప్రైజ్ ను అందించడం జరిగింది. ఇక ఈ షేరుకు రూ. 1370 స్టాప్ లాస్ ను కూడా వీఎల్ఏ అంబాలా అందించడం జరిగింది. ఇక ఈ కంపెనీ షేరు 5 రోజుల నుంచి 15 రోజుల్లో ఇచ్చిన టార్గెట్ ప్రైజ్ ను చేరుకునే అవకాశం ఉందని అంబాలా తెలుపడం జరిగింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ. 1494.95 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 366.10 గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 6210 కోట్లుగా ఉంది.

హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ :

ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ షేరు ధర 0.7 శాతం లాభపడి రూ. 2833 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ షేరుకు రూ. 2800 నుంచి రూ. 3100 టార్గెట్ ప్రైజ్ ను అందించడం జరిగింది. ఇక ఈ షేరుకు రూ. 2550 స్టాప్ లాస్ ను కూడా వీఎల్ఏ అంబాలా అందించడం జరిగింది. ఇక ఈ కంపెనీ షేరు 15 రోజుల నుంచి 30 రోజుల్లో ఇచ్చిన టార్గెట్ ప్రైజ్ ను చేరుకునే అవకాశం ఉందని అంబాలా తెలుపడం జరిగింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ. 3136.15 గాను, అలాగే 52 వారాల కనిష్ట ధర రూ. 2102.10 గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 2880 కోట్లుగా ఉంది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
Rupesh గురించి
Rupesh Senior Digital Content Producer